కమనీయంగా సీతారాముల‌ కళ్యాణం

నమస్తే శేరిలింగంపల్లి: శ్రీరామనవమి పండగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం లో శ్రీ సీతారాముల‌ కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగాయి. చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని ఆలయ ఉపాధ్యక్షుడు, భవాని మాత, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణ దాత తోట సుబ్బారాయుడు, కార్యవర్గ సభ్యులు, పరిసర ప్రాంత భక్తులు ఘనంగా జరిపించారు. మద్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చందానగర్ ప్రాంత భక్తులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు.

చందానగర్ వెంకటేశ్వర ‌ఆలయంలో‌ సీతారాముల కళ్యాణ మహోత్సవం

శేరిలింగంపల్లి నియోజకర్గంలోని పలు దేవాలయాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ పాల్గొన్నారు. మియాపూర్  ప్రశాంత్ నగర్ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో, మాదాపూర్ విట్టల్ రావు నగర్ లోని అభయాంజనేయస్వామి దేవాలయాల్లో సీతారామ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖశాంతులతో ‌ఉండాలని ఆకాంక్షించారు.

సీతారాముల కళ్యాణోత్సవంలో స్వామి వారికి అక్షింతలు సమర్పిస్తున్న మొవ్వా 

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇంద్రా రెడ్డి ఆల్విన్ కాలనీ శివాలయం దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో అందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలని ఆశిస్తూ అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారాముల జీవితం ఆదర్శప్రాయమని, నిజాయితీ, సన్మార్గానికి నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి‌ నాయకులు బుచ్చిరెడ్డి, శ్రీధర్ రావు,పృథ్వి కాంత్, విజయ్, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న జ్ఞానేంద్రప్రసాద్

నడిగడ్డ తండాలో…
నడిగడ్డ తండా హనుమాన్ మందిరంలో శ్రీరాముని కళ్యాణం గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. నడిగడ్డ తండా అధ్యక్షుడు తిరుపతి నాయక్, ఉపాధ్యక్షులు స్వామినాయక్, లక్ పతి నాయక్, గోపినాయక్, అబ్రహం, కమలాకర్, కృష్ణ నాయక్, మోహన్ నాయక్, ఆంజనేయులు, తిరుపతయ్య తదితరులు తండా వాసులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

నడిగడ్డ తండాలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు

ప్రజాసిటీ అపార్ట్ మెంట్ లో‌ని దుర్గా పోచమ్మ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు‌ ఘనంగా‌ జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ అధ్యక్షురాలు శివనాగమణి, కార్యదర్శి సుబ్బారావు, అపార్ట్ మెంట్ వాసుల ఆధ్వర్యంలో కమనీయంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ప్రజాసిటీ లో సీతారాముల కళ్యాణమహోత్సవ దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here