లోక కళ్యాణార్థం శివయ్యకు ఇంటికో చెంబుడు నీళ్లు

నమస్తే శేరిలింగంపల్లి: శివయ్యకు ఇంటికో చెంబుడు నీళ్లు అనే నినాదంతో దత్తోపాసకులు దైవజ్ఞ జ్యోతిష్య శిరోమణి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో హెచ్ఎంటీ శాతవాహన నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో తృతీయ- చతుర్ధ అతిరుద్రాభిషేక మహోత్సవాలు మూడో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని శివలింగానికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన అవసరమన్నారు. దైవ దర్శనంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. లోక కళ్యాణార్థం శివయ్యకు ఇంటికో చెంబుడు నీళ్లు అనే నినాదంతో బృహత్తర కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

శివ లింగానికి అభిషేకం చేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here