మదీన గూడలో ఐపీఎల్ బెట్టింగ్ బుకీల అరెస్టు – రూ. 10.15 లక్షలు స్వాధీనం

నమస్తే శేరిలింగంపల్లి: ఐపీఎల్ క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ బుకీలను అరెస్టు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మియాపూర్ పోలీసులు తెలిపి‌న వివరాల ప్రకారం మదీన గూడ లోని కల్కి అపార్ట్ మెంట్ బి- బ్లాక్ 507 ప్లాటులో గుంటూరు జిల్లా అరుండల్ పేట్ నర్సరావుపేటకు చెందిన రంగ కృష్ణ మూర్తి ప్రధాన బుకీ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నర్రా దుర్గా రెడ్డి, గోరంట్ల ధీరజ్ ఇద్దరు బుకీలు కలిసి ఐపీఎల్ క్రికెట్ 2022 ఆన్ లైన్ బెట్టింగ్ ను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ జోన్ ఎస్ ఓ టీ బృందం ఈ నెల 11వ తేదీన జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ పై ప్లాట్ లో ఐపీఎల్ ఆన్ లైన్ బెట్టింగ్ నడిపిస్తున్న వారిని పట్టుకున్నారు.‌ వారి వద్ద నుంచి రూ. 10.15 లక్షలు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని గేమింగ్ చట్టం ప్రకారం క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు చేశారు. ప్రధాన బుకీ రంగకృష్ణ మూర్తి పరారీలో ఉండగా దుర్గా రెడ్డి, ధీరజ్ ను మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఐపీఎల్ బెట్టింగ్ లో బుకీలను అరెస్టు చేసి‌ స్వాధీనం చేసుకున్న నగదు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here