నమస్తే శేరిలింగంపల్లి: చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ డివిజన్ లోని గుట్టలబేగం పేట్ మౌనిక టవర్స్ లో నివసించే సాయి అఖిల్ (27) బుధవారం ఉదయం తన తండ్రి మల్లిఖార్జున రావుతో కలిసి దుర్గం చెరువు వద్దకు వాకింగ్ కోసం వెళ్లాడు. వాకింగ్ పూర్తి కాగానే తన తండ్రిని ఇంటికి వెళ్లమని చెప్పిన సాయి అఖిల్ సమీపంలోని దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన అఖిల్ సాయి మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మాదాపూర్ పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
