కార్పొరేట‌ర్ జూనియ‌ర్ క‌ళాశాల‌ల అధిక ఫీజుల‌ను ప్ర‌భుత్వం నియంత్రించాలి: బిజెపి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కోవిడ్ కార‌ణంగా ప్ర‌జ‌ల ఆర్థిక ప‌రిస్థితులు చిన్నాభిన్న‌మైన త‌రుణంలో కార్పొరేట్ క‌ళాశాలలు ఇష్టానుసారంగా వ‌సూలు చేస్తున్న అధిక ఫీజుల‌ను నియంత్రించాల‌ని శేరిలింగంప‌ల్లి బిజెపి నాయ‌కులు డిమాండ్ చేశారు. బీజేవైయం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పిలుపు మేరకు భారతీయ జనతా యువమోర్చా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ అధ్యక్షతన బిజెపి, బిజెవైఎం రాష్ట్ర‌, జిల్లా, డివిజ‌న్ స్థాయి నాయ‌కులు మ‌దీనాగూడ‌ శ్రీ చైత‌న్యజూనియ‌ర్ క‌ళాశాల ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు క‌రోనా కార‌ణంగా ఆర్థికంగా చితికిపోయార‌ని, ప్రైవేట్ కళాశాలల ఫీజులు 50 శాతానికి తగ్గించి, అధిక ఫీజులు వసూలు చేయకుండా జీ.ఓ.నెంబర్.46 ను వెంటనే అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. పలు కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ క‌ళాశాల‌ల దోపిడిని అరిక‌ట్టాల‌ని, లేని పక్షంలో రానున్న రోజుల్లో బీజేవైయం ఆధ్వర్యంలో ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ , బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి , బీజేవైయం రాష్ట్ర కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్ , బీజేపీ జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి , బీజేవైయం రాష్ట్ర నాయకులు నిరటి చంద్రమోహన్ , మియపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు మాణిక్యారావు , బీజేవైయం జిల్లా కార్యదర్శి సాయి , బీజేవైయం నాయకులు శివ గౌడ్ , బీజేవైయం డివిజన్ అధ్యక్షులు ఆనంద్ , శివ కుమార్ , నవీన్ రెడ్డి , మధుసూదన్ రావు , నందు , క్రాంతి , బీజేవైయం డివిజన్ నాయకులు మున్నూర్ సాయి , అచ్యుత్ రెడ్డి , చరణ్ యాదవ్ , రాఘవేంద్ర , సాయి సుకుమార్ పటేల్ , మణ్యం , శ్రీను , అఖిల్ , సాయి , నితిన్ , కిరణ్ , ఓంకార్ , సంజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌దీనాగూడ శ్రీ చైత‌న్య క‌ళాశాల ఎదుట ధ‌ర్నా నిర్వ‌హిస్తున్న బిజెపి నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here