శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): పార్టీ కోసం నిబద్దతతో కష్టపడి పని చేసే కార్యకర్తలకు సముచితమైన స్థానం కల్పించేది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఎం.రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లికి చెందిన పలువురు నాయకులకు ఆదివారం మాజీ శాసన సభ్యులు ఎం.బిక్షపతియాదవ్ చేతుల మీదుగా పదవులను అందజేశారు. మైనార్టీ సెల్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీగా షేక్ సయ్యద్, పీజేఆర్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ ఎల్లయ్య, ఆల్విన్ కాలనీ డివిజన్ అధికార ప్రతినిధి రామ్మోహన్ లను నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా పదవులు పొందిన నాయకులను సన్మానించారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలు నేటికీ మర్చిపోలేదని, రానున్న జి.హెచ్.ఎంసి ఎలక్షన్స్ లో గడపగడపకు వెళ్లి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి ప్రకటించిన 10000 రూపాయల సహాయం సక్రమంగా అమలు చేయడం లేదని టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు , మరియు జిహెచ్ఎంసి అధికారులు కలిసి వరద బాధితులకు డబ్బులు ఇవ్వకుండా నాయకులు అధికారులు డబ్బులు పంచుకుంటున్నారని ఆరోపించారు. పదవులు పొందిన నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యలపై పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు యాదవ్, .బి బ్లాక్ ప్రెసిడెంట్ నరసింహాచారి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రావు, డివిజన్ యూత్ ప్రెసిడెంట్ ప్రదీప్ శేరిలింగంపల్లి ఎన్ ఎస్ యు ఐ ప్రెసిడెంట్ సందీప్ గౌడ్, మహంకాళి నగర్ బస్తీ ప్రెసిడెంట్ ఆంజనేయులు, ఆల్విన్ కాలనీ మహిళా అధ్యక్షురాలు అరుణ , కాంగ్రెస్ నాయకులు శేఖర్, నవాజ్, ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు