యువత చూపు బీఆర్ ఎస్ వైపు : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • బిఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని, యువత చూపు బిఆర్ ఎస్ వైపే ఉందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హాఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్, బీజేపీలకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బిఆర్ ఎస్ పార్టీలో చేరారు.

హాఫిజ్ పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమక్షంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసానికి వెళ్లగా.. పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకుంటామని తెలిపారు. హఫీజ్ పేట్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హాఫిజ్ పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కూకట్ పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం డి ఇబ్రహీం, కాశినాథ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి , అశోక్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన ముఖ్య నాయకులు జాన్సన్, సమీర్, షరీఫ్, సలీం, సాగర్, సతీష్, కార్తిక్, విజయ్, నిర్మల్, వంశీ, బషీర్, చింటూ, యోహాన్, విల్సన్, జీవన్, శ్యామ్సన్, దొర బాబు, అర్జున్, కాశినాథ్, మౌలానా, సచిన్, ధర్మేంద్ర, శ్రీనివాస్, సల్మాన్, నర్సింహ, రాం ప్రకాష్, అద్నాన్, సందీప్, విశాల్ ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here