శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): మున్నూరు కాపు డెవలప్‌మెంట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా శేరిలింగంపల్లికి చెందిన నందనం విష్ణుదత్ పటేల్ నియామకమయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి ఎడ్ల, ప్రధాన కార్యదర్శి సంతోష్ సరఫ్‌లు విష్ణుదత్‌ను నియమించి ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుదత్ మాట్లాడుతూ మున్నూరు కాపుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తన సేవలను గుర్తించి తనపై నమ్మకంతో తనకు ఈ పదవి అప్పగించినందుకు గాను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి ఎడ్ల కి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని, మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.






