మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌లో బ్లూ ప్లానెట్ ఆడిటోరియం ప్రారంభం

సైబ‌రాబాద్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లోని మెడిక‌ల్ హాస్పిట‌ల్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన బ్లూ ప్లానెట్ ఆడిటోరియంను సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డీకోడింగ్ సీటీవో అనే పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్యక్ర‌మంలో ప్రొఫెస‌ర్ సంప‌త్ కుమార్‌, డాక్ట‌ర్లు శ‌ర‌త్ రెడ్డి, అనిల్ కృష్ణ‌, కృష్ణ ప్ర‌సాద్‌, కృష్ణ కిర‌ణ్‌, సీనియ‌ర్ ఇంట‌ర్‌వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్టులు పాల్గొన్నారు.

మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌లో జ్యోతి వెలిగించి బ్లూ ప్లానెట్ ఆడిటోరియంను ప్రారంభిస్తున్న సైబ‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్

ఈ సంద‌ర్భంగా హాస్పిట‌ల్ ప్ర‌తినిధులు మాట్లాడుతూ.. నూత‌నంగా ఏర్పాటు చేసిన బ్లూ ప్లానెట్ ఆడిటోరియం వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా వైద్య రంగానికి చెందిన ఉద్యోగులు, సిబ్బంది ఆ రంగానికి చెందిన అనేక అంశాల‌పై వ‌ర్చువ‌ల్‌గా ట్రెయినింగ్ పొంద‌వ‌చ్చ‌ని అన్నారు. అలాగే డీకోడింగ్ సీటీవో పుస్త‌కం కార్డియాల‌జిస్టుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా సీపీ స‌జ్జ‌నార్ మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ ప్ర‌తినిధుల‌ను అభినందించారు. ప్ర‌పంచంలోని వైద్య నిపుణులు, ఉద్యోగులు, సిబ్బందికి ఉప‌యోగ‌ప‌డేలా వ‌ర్చువ‌ల్ ట్రెయినింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

హాస్పిట‌ల్ వైద్యులు, ప్ర‌తినిధులు, సిబ్బందితో సీపీ స‌జ్జ‌నార్
డీకోడింగ్ సీటీవో పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన సీపీ స‌జ్జ‌నార్‌, చిత్రంలో హాస్పిట‌ల్ వైద్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here