చందానగర్ లైట్‌హౌస్‌కు నాలుగేళ్లు.. 1,500 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు..

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) సహకారంతో నిర్వహిస్తున్న చందానగర్ లైట్‌హౌస్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, లైట్‌హౌస్ జాతీయ విస్తరణ విభాగం అధిపతి అతుల్, తెలంగాణ విస్తరణ విభాగం అధిపతి ఆకుల శ్రీనివాస్‌తో పాటు కేంద్రం బృంద సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. లైట్‌హౌస్ అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణా కోర్సులు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వృత్తి నైపుణ్యాల శిక్షణతో పాటు ఉద్యోగ అనుసంధాన కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు 1,500 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ, వారిని ఉపాధి రంగంలో స్థిరపడేలా చేయడంలో నిరంతరం కృషి చేస్తున్న చందానగర్ లైట్‌హౌస్ బృందాన్ని డిప్యూటీ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. యువత సాధికారత, ఉపాధి అవకాశాల కల్పనలో లైట్‌హౌస్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here