మణికొండ ఓయూ కాలనీలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మణికొండ గ్రామం ఓయూ కాలనీలో ఉన్న దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ప్రత్యేక పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆలయానికి హాజరై దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కొమిరిశెట్టి సాయిబాబాను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు శ్రవణ్ కుమార్, అశోక్ యాదవ్, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here