నల్లగండ్లలో బీఆర్‌ఎస్‌కు ఊపు.. పార్టీలో చేరిన 100 మంది యువత!

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి యువత నుంచి మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం గచ్చిబౌలి డివిజన్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నల్లగండ్ల గ్రామానికి చెందిన సుమారు 100 మంది యువత పార్టీలో చేరారు. శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా సమక్షంలో, నల్లగండ్ల డివిజన్ సీనియర్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, రాగం హరి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.

ఈ సందర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ యువతకు అందిస్తున్న ప్రోత్సాహంతో నల్లగండ్ల గ్రామ యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. యువత భాగస్వామ్యంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన యువతకు సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ.. కొమిరిశెట్టి సాయిబాబా నాయకత్వంలో, రాగం జంగయ్య యాదవ్ సహకారంతో నల్లగండ్ల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగండ్ల డివిజన్ సీనియర్ నాయకులు చెన్నం రాజు, భిక్షపతి యాదవ్, శంకరి రాజు ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, సాయికుమార్, కిషోర్, సాయి శివ, విలాష్, మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here