హెచ్‌సీయూ డిపోలో ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) బస్సు డిపోలో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో యూనియన్ సభ్యులు శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌ను యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. వీరితో పాటు TMU ప్రధాన కార్యదర్శి ఈ. అశ్వత్థామ రెడ్డి, TWU RTC అధ్యక్షుడు మొగుల్ల రాజిరెడ్డి, TMU అధ్యక్షుడు శంకర్, డిపో ఛైర్మన్ బాలయ్య, డిపో కార్యదర్శి వై.ఎస్. బసప్ప, డిపో అధ్యక్షుడు టి. మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 9న జరగనున్న యూనియన్ ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు. బాణం గుర్తుకు కార్మికులు మద్దతు ఇచ్చి యూనియన్‌ను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం హెచ్‌సీయూ డిపోకు చెందిన కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్ అభ్యర్థులను గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కుమార్, బీమన్ శ్రీను, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, చీఫ్ అడ్వైజర్లు మహేష్ గౌడ్, ప్రసాద్, ట్రెజరర్ రవి కుమార్, కమిటీ సభ్యులు రవి, మల్లేశం, ఎం. శ్రీశైలం, నర్సింలు, శ్రీశైలం, అనిల్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here