శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకురాలు కవిత ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యలపై ఆందోళన నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం స్పందించి నాయకులతో చర్చలు జరిపింది. కార్మికుల సమస్యలను పరిశీలించి రెండు నెలల్లో పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు తెలంగాణ రక్షణ సేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున నిరంతరం పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.





