శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో ఖైతలాపూర్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో స్వచ్ఛంద శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ కమిషనర్ సృజనతోపాటు అదనపు కమిషనర్ (హెల్త్ & శానిటేషన్), కూకట్‌పల్లి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సీఎంసీ అధికారులు, పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు, పారిశుధ్య సిబ్బంది, వాలంటీర్లు కలిసి క్షేత్రస్థాయిలో స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించడం, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచడం వంటి అంశాలపై కార్యక్రమం ద్వారా సందేశాన్ని అందించారు. స్వచ్ఛమైన నగర నిర్మాణంలో ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని సీఎంసీ పేర్కొంది. సామూహికంగా చేపట్టే చిన్నచిన్న ప్రయత్నాలు నగర పరిసరాలను మరింత పరిశుభ్రంగా మార్చేందుకు దోహదపడతాయని తెలిపింది. ప్రజలు కూడా స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను స్వీకరించాలని సీఎంసీ కోరింది.






