యోగాతో శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యం: బాబా రాందేవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌జ‌ల‌ను ఆరోగ్యవంతుల‌ను చేయాల్సిన బాధ్య‌త యోగా శిక్ష‌కుల‌పై ఉంద‌ని ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. హరిద్వార్ పతంజ‌లి యోగా పీఠ్‌లో 5 రోజుల పాటు జ‌రిగిన యోగా టీచ‌ర్స్ ట్రెయినింగ్ కార్య‌క్ర‌మాల్లో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ నిత్యం యోగా చేయాల‌ని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాల‌ని సూచించారు. గ్రామ గ్రామాల్లో ఉచిత యోగా త‌ర‌గతుల‌ను నిర్వ‌హించాల‌ని, ప్ర‌జ‌ల‌ను ఆరోగ్య‌వంతుల‌ను చేయాల‌ని పిలుపునిచ్చారు. నిత్యం యోగాస‌నాలు, ప్రాణాయామాలు, ధ్యానం చేయ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని, మాన‌సిక‌, శారీర‌క ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని అన్నారు. శారీర‌క స‌మ‌స్య‌లు, మాన‌సిక ఆందోళ‌న‌లను సంపూర్ణంగా దూరం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. గుల్‌మోహ‌ర్ పార్క్ కాల‌నీ, ప‌తంజ‌లి యోగా గురువులు నూనె సురేంద‌ర్‌, గారెల వెంక‌టేష్ మాట్లాడుతూ బాబా రామ్‌దేవ్ చేతుల మీదుగా యోగా శిక్ష‌క్ స‌ర్టిఫికెట్‌ను అందుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని త‌ర‌గ‌తులు మొద‌లు పెట్టి ప్ర‌జ‌ల ఆరోగ్యం కాపాడేందుకు తోడ్ప‌డుతామని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here