శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా హఫీజ్పేట్ వార్డులోని ఆల్విన్ కాలనీ పార్క్లో సామూహిక స్వచ్ఛంద శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, స్వచ్ఛ భారత్ మిషన్ (SWM) సిబ్బంది, స్థానిక RWA ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రతినిధులు కలిసి పార్క్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా, చెత్త రహితంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించారు. పార్కులు, పరిసర ప్రాంతాల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని, స్వచ్ఛత కార్యక్రమాల్లో స్థానికులు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సూచించారు.







