శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం నూతన యువజన అధ్యక్షుడిగా ఎన్నవరం హరికుమార్ గుప్తా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య వర్గీయులు నటరాజ్ గుప్తా, మహేష్ గుప్తా, సంపత్ గుప్తాలు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన యువజన అధ్యక్షుడు హరికుమార్ గుప్తాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి, యువతను సంఘటితం చేయడానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.






