భగత్ సింగ్ జయంతి సందర్భంగా USFI ఘన నివాళులు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి నాయకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా USFI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ధైర్యంగా పోరాడిన మహోన్నత యువ నాయకుడు భగత్ సింగ్ అని అన్నారు. విద్యార్థులు, యువతలో దేశభక్తి, శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో ఆయన ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

భగత్ సింగ్ కేవలం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు మాత్రమే కాదని, సమానత్వం, సామాజిక న్యాయం, దోపిడీ లేని సమాజం కోసం ఆలోచించిన యువ విప్లవకారుడని తెలిపారు. విద్యార్థులు భగత్ సింగ్ జీవితాన్ని, ఆయన రచనలను అధ్యయనం చేసి సమాజంలోని సమస్యలపై చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల విద్యా హక్కులు, సామాజిక న్యాయం, ప్రభుత్వ విద్యా సంస్థల పరిరక్షణ కోసం USFI నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు. భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఐక్యంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో USFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగూరు వెంకటేశ్వర్లు, గర్ల్స్ కన్వీనర్ రేణుక, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here