శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారం గ్రామంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. గంగారంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. గ్రామస్తులు, యువత ఆసక్తిగా పాల్గొన్న ఈ వేలంలో లడ్డూకు మంచి డిమాండ్ ఏర్పడింది. చివరకు రూ.53,001కు దొంతి రవిశంకర్ ముదిరాజ్ లడ్డూను కైవసం చేసుకున్నారు. నిర్వాహకులు ఆయనకు లడ్డూను అందజేశారు.

నిమజ్జనోత్సవం సందర్భంగా యువత ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తరలించే సమయంలో భక్తులు, యువత ఉత్సాహంగా పాల్గొని నినాదాలు చేయడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సాయి కిషోర్, దొంతి సాయి కృష్ణ, విశ్వతేజతో పాటు శ్రీకృష్ణ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో ముగిసింది.





