విద్యావర్ధిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక ఉత్సవాలు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): విద్యావర్ధిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతిగా 1 గ్రాము బంగారం లావణ్యకి, ద్వితీయ బహుమతిగా 20 గ్రాముల వెండి నాజియా బేగంకు, తృతీయ బహుమతిగా 10 గ్రాముల వెండి అఖిలకు అందజేశారు. ఈ బహుమతులను మాదుపాటి శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు.

అదేవిధంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో పిరంగి మల్లేష్ గౌడ్ రూ.2,03,001లకు లడ్డూను దక్కించుకున్నారు. మాదుపాటి శివకుమార్ చేతుల మీదుగా లడ్డూను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యావర్ధిని ఉత్సవ కమిటీ సభ్యులు సాయిమురళి, సంపత్, నర్సింహ, గణేష్, శ్రీను, మహేష్, గుణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here