విద్యావారిది గణనాథుడి లడ్డు @ రూ.2,03,001.. దక్కించుకున్న పిరంగి మల్లేష్ గౌడ్.. ముగ్గుల పోటి విజేతలకు బంగారు, వెండి నాణాలు..

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): విద్యావారిది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతిగా 1 గ్రాము బంగారం లావణ్యకి, ద్వితీయ బహుమతిగా 20 గ్రాముల వెండి నాజియా బేగంకు, తృతీయ బహుమతిగా 10 గ్రాముల వెండి అఖిలకు అందజేశారు. ఈ బహుమతులను మాదుపాటి శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు.

వేలంపాటలో లడ్డు దగ్గించుకున్న పిరంగి మల్లేష్ గౌడ్ తో నిర్వాహకుడు శివకుమార్

అదేవిధంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో పిరంగి మల్లేష్ గౌడ్ రూ.2,03,001లకు లడ్డూను దక్కించుకున్నారు. మాదుపాటి శివకుమార్ చేతుల మీదుగా లడ్డూను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యావర్ధిని ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్ గౌడ్, సాయిమురళి, సంపత్, నర్సింహ, గణేష్, శ్రీను, మహేష్, గుణ తదితరులు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీలో విజేతలకు బంగారు వెండి నాణాలు అందజేస్తున్న నిర్వాహకుడు శివకుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here