మియాపూర్‌లో ఘనంగా వినాయక చవితి ముగింపు వేడుకలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పరిధిలోని దత్త సాయి కాలనీ, నడిగడ్డ తండా, అర‌బిందో కాలనీల్లో వినాయక చవితి ముగింపు వేడుకల‌ను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలతోపాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, TPCC జనరల్ సెక్రటరీ వి. జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ఆయా ఉత్సవ కమిటీల ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

దత్త సాయి కాలనీ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో కమిటీ అధ్యక్షుడు రవి కృష్ణ, సురేష్, మారుతి, నాగేశ్వరావు తదితరులు అతిథులను స్వాగతించారు. కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి, మూర్తి, రవి, శంకర్, మధు, ప్రణీత్, వంశీ, ప్రవీణ్ తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మయూరి నగర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో నడిగడ్డ తండా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల‌ను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మణ్, శంకర్, శివ, సచిన్, సుమన్, దేవేందర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అర‌బిందో కాలనీలో వినాయక చవితి ముగింపు వేడుకల‌ను భక్తి, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. అర‌బిందో గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో లోకేష్, రమేష్, సురేష్ తదితర కమిటీ సభ్యులు అతిథులను సన్మానించారు. మూడు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో స్థానికులు, మహిళలు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం, సర్వశ్రేయస్సు కలగాలని నాయకులు ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here