ప్రశాంత్ నగర్‌లో ఘనంగా మహా అన్నసమారాధన

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రశాంత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని గణనాథ మండపం వద్ద గురువారం మహా అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు చింతకింది గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2,500 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గోవర్ధన్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదు గణనాథ మండపాల వద్ద అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే ఆదర్శ్ నగర్ కాలనీ, లింగంపల్లి రెయిన్ ట్రీ కమ్యూనిటీ, గోపి నగర్ భ‌జరంగ్ యూత్ గణనాథ మండపాల వద్ద ఒక్కో చోట సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రశాంత్ నగర్ కాలనీ గణనాథ మండపం వద్ద 2,500 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాద వితరణకు అవకాశం కల్పించిన కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులకు గోవర్ధన్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, పరిసర కాలనీల ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here