ఎస్‌పీ రెసిడెన్సీ వినాయకుడి లడ్డూ వేలం.. రూ.1.52 లక్షల‌కు దక్కించుకున్న బెజగం కేశవులు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆదర్శనగర్‌లోని ఎస్‌పీ రెసిడెన్సీ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నిమజ్జన ఊరేగింపులో భాగంగా నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలం పాటలో రెసిడెన్సీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలం పాటలో చివరకు శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజగం కేశవులు కుటుంబ సభ్యులు రూ.1,52,116కు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు. దీంతో రెసిడెన్సీలో సందడి నెలకొంది.

ఈ సందర్భంగా బెజగం కేశవులు మాట్లాడుతూ.. ఇప్పటికే వెస్ట్ మారేడ్‌పల్లిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో గణనాథుడి లడ్డూను రూ.1,35,000కు దక్కించుకున్నామని తెలిపారు. తాజాగా తాము నివాసముండే ఎస్‌పీ రెసిడెన్సీ వినాయకుడి లడ్డూను కూడా కైవసం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెసిడెన్సీ వాసులు చింతకింది డాక‌య్య గౌడ్, మహేందర్ గౌడ్, నర్సింహులు, వేణుగోపాల చారి, శ్రవణ్ చారి, ఎల్లేష్, రాజశేఖర్ రెడ్డి, స్వాతి, మీనా, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here