శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో భేరి రాంచందర్ యాదవ్‌తో పాటు స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులతో నేతాజీ నగర్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.






