శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఓల్డ్ హఫీజ్‌పేట్‌లో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మియాపూర్ సీఐ జయరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాలింగ్ గౌతమ్ గౌడ్‌ను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సీఐ జయరాం అభినందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, భక్తులకు, కాలనీ వాసులకు బాలింగ్ గౌతమ్ గౌడ్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





