మోదీ 76వ జన్మదినం.. హఫీజ్‌పేట్‌లో ఆశీర్వాద జ్యోతులు వెలిగించిన బీజేపీ నేతలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని హఫీజ్‌పేట్ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ‘సవా సంకల్ప్ అభియాన్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ క్రాస్‌రోడ్డులోని వినాయక మండపం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వాద జ్యోతులు వెలిగించారు. దేశ ప్రగతి, రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మోదీ చేస్తున్న సేవలను ప్రస్తావిస్తూ.. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో శతాయుష్షుగా వర్ధిల్లాలని, దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మూల అనిల్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సజ్జ కోటేశ్వర రావు, శ్రీధర్ రావు, సీనియర్ నాయకుడు పృథ్వీ కాంత్ గౌడ్ పాల్గొన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్‌తో పాటు బీజేపీ నాయకులు నందు, కిరణ్, దయానంద్, గిరి, శ్రీనివాస్ రాజు, సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here