వినాయక నవరాత్రుల్లో ఘనంగా కుంకుమ పూజ.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీప్తి శ్రీనగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ దేవి హోమ్స్ ఖ్యాతి ప్రాంగణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్ సతీమణి యామిని దివ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక స్వామివారిని దర్శించుకుని, కుటుంబ సభ్యులతోపాటు కాలనీ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రార్థించారు.

కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్‌తోపాటు కమిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల పూజలు, మంత్రోచ్ఛారణలతో ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here