శ్రీరామ్‌నగర్ సి బ్లాక్‌లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ప్రత్యేక పూజల్లో రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని శ్రీరామ్‌నగర్ సి బ్లాక్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రవికుమార్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలలో ఆధ్యాత్మిక భావన పెంపొందేలా భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here