శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి తారానగర్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వద్ద విశ్వకర్మ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా వేడుకలను నిర్వహించారు. బి.ఆర్. గ్యాస్ సమీపంలోని ఆలయ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటలకు స్వర్ణకారులచే ప్రత్యేక యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు, సంఘం సభ్యులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి విశ్వకర్మ జయంతి సందర్భంగా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయన సేవలను, విశ్వ నిర్మాణానికి సంబంధించిన సంప్రదాయ విశ్వాసాలను స్మరించుకున్నారు. ప్రజలకు, స్వర్ణకార సంఘం సభ్యులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తారానగర్ విశ్వకర్మ స్వర్ణకార సంఘం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు, సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ కులాల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ప్రపంచానికి విశ్వకర్మ మార్గదర్శకాలను సూచించారని, ఆయన చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కృష్ణ, గోవిందరావు చారి, రవీందర్ చారి, శేరిలింగంపల్లి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఎం. ప్రభాకర్ చారి, ఉపాధ్యక్షుడు ఎ. రఘు చారి, బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, రాయుడు, ఆర్టీసీ సురేష్ యాదవ్, అన్నదొర, మల్కయ్య తదితరులు పాల్గొన్నారు. వినయ్ కుమార్ గౌడ్, ప్రభు చారి, గోవిందరావు, రఘు చారి, శ్రీధర్ చారి, పి. రవికాంత్ చారి, పి. ఆంజనేయ చారి, యాదగిరి చారి, ఎన్. ప్రభాకర్, ఎన్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.





