మియాపూర్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం, స్వతంత్ర భారతదేశంలో విలీనం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోరాట యోధుల స్ఫూర్తిని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్.బి.ఆర్. కాంప్లెక్స్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విమోచన పోరాట యోధులకు నివాళులర్పించారు. దేశ సమైక్యత, అఖండతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులతోపాటు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమళ్ల నాగేశ్వర్ గౌడ్, మాణిక్యరావు, కుమారస్వామి, పట్టాభిరామ్, రత్నకుమార్, ప్రభాకర్, కిరణ్ కుమార్ రెడ్డి, డి.చందు, మక్తా డివిజన్ అధ్యక్షుడు జాజెరావు శ్రీను, పారునంది నాగులు, కోడెల ప్రసాద్, డేవిడ్, రెడ్డమ్మ, మాధవి, మహేష్ యాదవ్, వెంకట్, రాము, చందు ముదిరాజ్, వెంకట్ యాదవ్, నారాయణరెడ్డి, పత్తి బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి హాజరై జాతీయ జెండాకు గౌరవం సమర్పించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పారునంది నాగులు ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఆశీర్వాద దీపం వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here