గౌతమీ నగర్‌లో ఘనంగా విజయగణపతి హోమం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గౌతమీ నగర్ కాలనీ మున్సిపల్ పార్కులో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం విజయగణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు కాలనీకి చెందిన పలువురు దంపతులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here