శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకుని హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు. డివిజన్‌లోని ఎల్లమ్మ బస్తీ గణేశ్ మండపం వద్ద నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక కాలనీవాసులు, పలువురు నాయకులు, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి వెల్లివిరియాలని గణనాథుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పవన్ గౌడ్, రాజారాం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.






