మియాపూర్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ జి. శ్రీనివాస్ ఆహ్వానం మేరకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here