శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ సర్వే నంబర్ 214, ఏసీ 4-22 పరిధిలోని శ్మశానవాటిక భూమిని భూకబ్జాదారుల నుంచి రక్షించాలని కోరుతూ శేరిలింగంపల్లి తహసీల్దార్ కు ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. సుమారు 400 ఏళ్ల నాటి సమాధులు ఉన్న ఈ భూమిని కొందరు వ్యక్తులు మియాపూర్లోని తప్పుడు సర్వే నంబర్ 44/1 పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతినిధులు ఆరోపించారు. ఖబరస్తాన్ భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, భూకబ్జాలకు అవకాశం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అన్వర్ షరీఫ్, మహ్మద్ రోషన్ అలీ, సయ్యద్ అహ్మద్, షేక్ జమీర్, షేక్ సాబేర్, మహ్మద్ వజీర్, మహ్మద్ ఖాజా, సయ్యద్ హనీఫ్ అహ్మద్, మహ్మద్ కుతుబుద్దీన్తో పాటు పలువురు పాల్గొన్నారు.






