కేసీఆర్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి: మియాపూర్ పోలీసులకు బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసినట్లు పేర్కొన్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ మ‌ర‌ణించాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన బీఆర్‌ఎస్ నాయకులు.. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు, కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు అవకాశం ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత దూషణలకు తీసుకెళ్లకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంగారం సంగారెడ్డి, రామకృష్ణ గౌడ్, వాలా హరీష్, శివరాజ్ ముదిరాజ్, బీఎస్ఎన్ కిరణ్, రోజా, సాబీర్, బాబు మోహన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here