శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సమస్యలు, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నించడం నేరమైతే ఆ నేరాన్ని మళ్లీ మళ్లీ చేస్తామని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. మాధవ రెడ్డి అన్నారు. ప్రజల కోసం అసెంబ్లీ పనిచేస్తుందా? లేక పార్టీల రాజకీయాల కోసం పనిచేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు, నిర్బంధాలతో అడ్డుకోవడం సరికాదన్నారు.

అరెస్టులతో ప్రజల గొంతును, నిర్బంధాలతో పోరాటాన్ని ఆపలేరని మాధవ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల పక్షాన జనసేన పార్టీ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ప్రజల గొంతే మా గొంతు అని ఆయన పేర్కొన్నారు.





