శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అట్టేపల్లి రామప్రభు తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని M.A. నగర్ కాలనీలో ఆయన పర్యటించి స్థానికులతో నేరుగా సమావేశమై అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ప్రధానంగా డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్ల సమస్యలను రామప్రభు దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. సమస్యల తీవ్రత, స్థానిక పరిస్థితులను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను కేవలం విని వెళ్లడం కాదు.. పరిష్కారం జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడటమే తన బాధ్యత అని అట్టేపల్లి రామప్రభు అన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలపై నిరంతరం స్పందించడం, పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తీసుకురావడం తన లక్ష్యమని తెలిపారు. కాలనీలోని ప్రతి సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా తన వంతు కృషి చేస్తానని రామప్రభు పేర్కొన్నారు. ప్రజల మధ్యే ఉంటాం.. ప్రజల సమస్యలపై పోరాడుతాం.. పరిష్కారం సాధించే వరకు వెనక్కి తగ్గం అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో M.A. నగర్ కాలనీ వాసులు అనిల్ ముదిరాజ్, శరత్, యాదయ్య, దశరథ్, నరసింహ గౌడ్, రామకృష్ణ గౌడ్, గణేష్ గౌడ్, సకలి మారుతి, గురు పాండు, రామస్వామి, శంకర్ నాయక్, తిరుమల సాగర్, మహేష్ బి., పి. శ్రీనివాస్, గోపాల్, బాలరాజ్, నాని, కసయ్య, వేణుగోపాల్ రెడ్డి, కురుమూర్తి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ARP టీమ్ సభ్యులు అట్టేపల్లి పురుషోత్తము, అడప అజయ్, అట్టేపల్లి ప్రశాంత్, కడారి రాజు, ఎం. సాయి గౌడ్, కె. శ్రీను, టి. ప్రదీప్, శేఖర్ ముదిరాజ్, పల్లాపు శ్రీను, బి. నవీన్, ఎస్. శివ, ఎస్. గణేష్, టి. శ్రీకాంత్, మహేష్, కె. నాని, నరసింహ, పి. వెంకటస్వామి, సత్యం, పవన్ చక్రవర్తి, ఎన్. చంద్రశేఖర్, పింటూ తదితరులు పాల్గొన్నారు.





