ఘ‌నంగా పోచమ్మ తల్లి పూజలు.. పాల్గొన్న పొట్ట నరేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని గోపీనగర్, బాపునగర్ ప్రాంతాల్లో పోచమ్మ తల్లి అమ్మవారి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ పాల్గొన్నారు. స్థానిక పెద్దలు, యువతతో కలిసి పోచమ్మ తల్లిని దర్శించుకున్న నరేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులు, అమ్మవారి దీవెనలతో శేరిలింగంపల్లి అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, పెద్దలు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here