శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీలో షాద్‌నగర్ జిల్లా పోరాట సమితి నాయకులు, సభ్యులు చేరేందుకు అంగీకరించారు. ఈ మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి షాద్‌నగర్ జిల్లా పోరాట సమితి అధ్యక్షుడు సంతోష్, కుందుర్తి మండల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ జిల్లా పోరాట సమితి నాయకులు, సభ్యులను పార్టీలోకి ఆహ్వానించే అంశంపై సంతోష్‌తో జిల్లా నాయకత్వం విస్తృతంగా చర్చించింది.

పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన పోరాటాలు, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. చర్చలు సఫలీకృతం కావడంతో పోరాట సమితి నాయకులు, సభ్యులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరేందుకు అంగీకరించారు. త్వరలోనే అధికారికంగా పార్టీలో చేరనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి పద్మ, శేరిలింగంపల్లి నియోజకవర్గ జనరల్ సెక్రటరీ కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.





