మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ 227వ డివిజన్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ పాల్గొన్నారు. గఫూర్, గఫ్ఫార్, నిజాముద్దీన్ లతో కలిసి వేడుకల్లో పాల్గొని ముస్లింలకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవసేవ విలువలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. మత సామరస్యం, సోదరభావంతో ప్రజలంతా కలిసి ముందుకు సాగాలని కోరారు. అనంతరం మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here