శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి: ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన పలువురు కాలనీ వాసులు తమ ప్రాంతంలోని సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వినతిపత్రం అందించారు. కాలనీ వాసుల సమస్యలపై శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో స్వయంగా పర్యటించి సమస్యలను పరిశీలిస్తానని, అవసరాన్ని బట్టి విడతల వారీగా అభివృద్ధి పనులను చేపట్టి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాలనీల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో డివిజన్‌లో అత్యవసరంగా ఉన్న ప్రాంతాలకు, నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. కాలనీ ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతోపాటు పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన ప్రజా జీవనానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. మియాపూర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ వాసులు నరేష్, సాంబయ్య, అనుదీప్ రెడ్డి, కరుణాకర్, బాలు చౌదరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here