మదీనాగూడ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమ నియామకం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమ నియమితులయ్యారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆయనకు నియామక పత్రాన్ని అధికారికంగా అందజేశారు. మదీనాగూడ ప్రాంతానికి చెందిన కుమార్ కురుమ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశయాలకు అనుగుణంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. కుమార్ కురుమ నియామకంతో మదీనాగూడ డివిజన్‌లో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here