శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నియామకాలు చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్.. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్‌గా బి. రఘును, జనరల్ సెక్రటరీగా వి. పవన్ కుమార్‌ను నియమించారు. అదే సమయంలో వివిధ కళాశాలలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకులంతా సమిష్టిగా కృషి చేసి పార్టీ విజయానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. కవితను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. శ్రీను, సాయి, అనికేత్, యోగేందర్, మాణిప్రీత్, నాని, అభిరామ్, నరేంద్ర, తేజ, విశాల్, అరుణ్‌తో పాటు పలువురు విద్యార్థులు పార్టీలో చేరారు. పార్టీ ముఖ్య నాయకుడు సందీప్, టీఆర్ఎస్ బీసీ ప్రెసిడెంట్ విష్ణు, టీఆర్ఎస్ కార్మిక ప్రెసిడెంట్ దారుపల్లి అనిల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.





