శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ శాసన పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం గురువారం నిర్వహించారు. పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆడిట్ పేరా నంబర్ 3.7పై సుదీర్ఘంగా చర్చించారు. షార్ట్ లెవీ ఆఫ్ కన్వర్షన్ ఛార్జెస్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఇన్‌కరెక్ట్ రేట్స్ అంశంపై కమిటీ సభ్యులు చర్చించారు. సమావేశంలో కమిటీ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, రామారావు పవార్, కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

సమావేశానికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) పి. మాధవి, సీఏజీ (ఆడిట్) కార్యాలయ అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్, ఆర్ అండ్ ఎస్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఆడిట్ పేరా నంబర్ 3.7కు సంబంధించిన అంశాలపై అధికారులు వివరాలు సమర్పించగా, కమిటీ సభ్యులు వాటిపై విస్తృతంగా చర్చించారు. అనంతరం సుదీర్ఘ చర్చల తర్వాత సదరు ఆడిట్ పేరాను కమిటీ సెటిల్ చేసింది.





