సాయినగర్ బస్తీలో డ్రైనేజీ సమస్యపై శ్రీనివాస్ గౌడ్ పరిశీలన

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయినగర్ బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను బీఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గురువారం పరిశీలించారు. స్థానిక నాయకులు డ్రైనేజీ సమస్యను ఆయన దృష్టికి తీసుకురావడంతో, సమస్య ఉన్న ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. డ్రైనేజీ సమస్య కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న శ్రీనివాస్ గౌడ్, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి ముదిరాజ్, రాహుల్, లక్ష్మణ్, సెల్వరాజ్‌తో పాటు సాయినగర్ బస్తీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here