రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మదీనగూడలో నూతన ఓటరు నమోదు కార్యక్రమం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మదీనగూడ డివిజన్‌లోని హుడా కేఫే వద్ద నూతన ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒబిసి చైర్మన్ జైపాల్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, టీపీసీసీ లేబర్ వైస్ ప్రెసిడెంట్ నల్ల సంజీవ రెడ్డి, శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజన్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు మండగడ్డ నర్సింగ్ రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, యువత ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here