పేద కుటుంబానికి రూ.5 లక్షల CMRF-LOC అందించిన ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని పాపారాయుడు కాలనీకి చెందిన గోన సరస్వతికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఈ మేరకు మంజూరైన CMRF-LOC పత్రాన్ని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న హస్తంగా నిలుస్తోందని గాంధీ తెలిపారు. అత్యవసర వైద్య చికిత్సల సమయంలో CMRF ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు ఎంతో భరోసానిస్తోందని అన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, పోతుల రాజేందర్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here