నల్లగండ్ల డివిజన్‌ నూతన అధ్యక్షుడు కిషన్‌ గోలికి గంగాధర్‌ రెడ్డి శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల డివిజన్‌ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కిషన్‌ గోలి గురువారం గౌలిదొడ్డిలోని కార్పొరేటర్‌ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ గంగాధర్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కిషన్‌ గోలికి గంగాధర్‌ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని గంగాధర్‌ రెడ్డి సూచించారు. నల్లగండ్ల డివిజన్‌లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని, నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని గంగాధర్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు హీరన్‌, సాయిరామ్‌, అంబన్‌, దేవేందర్‌, అరుణ్‌, మధు, శంకర్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here